![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -386 లో.. పూజారిని కృష్ణ కలిసి జరిగింది చెప్తుంది. నువ్వు కర్పూరం దేవుడి ముందు వెలిగించని పూజారి చెప్పగానే కృష్ణ అలాగే చేస్తుంది. ఆ తర్వాత కృష్ణ వెలిగించిన కర్పూరం ఆరిపోతుంది. మళ్ళీ ఏంటి ఇలా జరిగిందని కృష్ణ టెన్షన్ పడుతు పూజారిని అడుగుతుంది. ఏం లేదంటు తన భయాన్ని పొగుడుతాడు. ఆ తర్వాత కృష్ణ వెళ్ళిపోయాక.. ఇలా జరగకూడదు కానీ ఆ అమ్మాయి బయపడుతుందని ఏం కాదని చెప్పాను.. ఆ అమ్మాయికి ఏదో సమస్య రాబోతుందని పూజారి అనుకుంటాడు.
ఆ తర్వాత బెస్ట్ కపుల్ కాంటెస్ట్ గురించి ముకుంద టెన్షన్ పడుతుంది. నేను అందరి ముందు కాంటెస్ట్ లో ఆదర్శ్ తో ఎలా క్లోజ్ గా ఉండాలి. నా మనసు ఒప్పుకోవడం లేదని ముకుంద అనుకుంటుంది. అప్పుడే ఆదర్శ్ రోజ్ ఫ్లవర్స్ పట్టుకొని వచ్చి హ్యాపీ వాలింటైన్ డే అని చెప్పగానే ముకుంద షాక్ అవుతుంది. ఏంటిప్పుడు చెప్తున్నావ్వని ముకుంద అడుగుతుంది. బెస్ట్ కపుల్ కాంటెస్ట్ లో ఇలాంటివి ఉంటాయి కదా.. అందుకే ప్రాక్టీస్ చేస్తున్నానని ఆదర్శ్ అనగానే.. నాకు ఇలాంటివి అన్ని ఇష్టం ఉండవని ముకుంద చెప్తుంది. అసలు నన్ను నిజంగానే తీసుకొని రమ్మని కృష్ణ, మురారీలని నువ్వే పంపించావా? ఎందుకిలా చేస్తున్నావని ఆదర్శ్ అడుగుతాడు. అంటే నాకు బయట అందరి ముందు ఇలా చేయడం నచ్చదు. కృష్ణ అంటే సరదాగా ఉంటుంది. అందరిముందు డాన్స్ చేస్తుంది నాకు కంఫర్ట్ గా ఉండదని ముకుంద అంటుంది. సరదాగా బయటకు వెళదామంటే డస్ట్ ఎలర్జీ అంటావ్.. ఏది అందరి ముందు చెప్పవని ఆదర్శ్ అంటాడు. అదేం లేదని ముకుంద కవర్ చేస్తుంది. ఇప్పుడు ఈ కాంపిటేషన్ కూడా వద్దని చెప్తే ఏమని అనుకుంటారోనని ఆదర్శ్ అంటాడు. ఏదో ఒకటి చెయ్యండి నన్ను అర్థం చేసుకోండి అని ముకుంద అంటుంది.
ఆ తర్వాత కృష్ణ, మురారి ఒక హోటల్ దగ్గర ఆగుతారు. ప్రొద్దున టిఫిన్ చేయకుండా బయటకు వచ్చాము. అందుకే టిఫిన్ చేద్దామని మురారి అంటాడు. ఆ తర్వాత గుడిలో దీపం ఆరిపోయిన దాని గురించి టెన్షన్ పడుతుంది కృష్ణ. మురారి ఆ టెన్షన్ పోగేట్టేలా చేస్తాడు. ఆ తర్వాత మురారికి చట్నీ పెదాలకి అంటుంది. కృష్ణ ప్రేమగా అది తుడుస్తుంటే అందరు వాళ్ళనే చూస్తుంటారు. కృష్ణ సిగ్గు పడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |